శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (17:38 IST)

పాలు, బెల్లంతో.. ముఖం మృదువుగా..?

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పాలలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంత మేలు అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. క

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పాలలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంత మేలు అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. కాబట్టి పాలలో కొద్దిగా పటిక బెల్లం కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది.
 
కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోవడానికి ఇలా చేస్తే.. ముల్తానీ మట్టిలో కొద్దిగా పటిక బెల్లం, పెరుగు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది.
 
పటిక బెల్లం కొన్ని గోరువెచ్చని నీరు, చక్కెర కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని అరగంట తరువాత చల్లని నీటిలో కడిగేసుకోవాలి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. శరీర వేడిని తగ్గించుటలో పటిక బెల్లం మంచిగా దోహదపడుతుంది. 
 
ఒత్తిడి, అలసటగా ఉన్నప్పుడు పాలలో కొద్దిగా పటిక బెల్లం కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా పాలలో బెల్లం వేసుకున్నప్పుడు చక్కెర వేసుకోకూడదు. తరుచుగా పాలలో చక్కెర కంటే బెల్లం కలిపి తీసుకుంటేనే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గించుటకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.