శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2017 (16:32 IST)

చికెన్ తింటే జుట్టు బాగా పెరుగుతుందట..

చికెన్‌లో వుండే మాంసకృత్తులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాదు చివర్లు చిట్లకుండా నివారిస్తాయి. అలాగే జామపండు ఇందులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది జుట్టు చిట్లడా

చికెన్‌లో వుండే మాంసకృత్తులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాదు చివర్లు చిట్లకుండా నివారిస్తాయి. అలాగే జామపండు ఇందులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది జుట్టు చిట్లడాన్ని, రాలడాన్ని తగ్గించి.. ఆరోగ్యంగా మారుస్తుంది.

పాలకూర జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి మూలకారణం ఇనుము లోపించడమే కారణం. పాలకూరలో ఇనుముతోపాటు ఎ, సి విటమిన్లూ, మాంసకృత్తులు ఉంటాయి. ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం లాంటి పోషకాలూ అందుతాయి. ఇవన్నీ జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా మారుస్తాయి.
 
కోడిగుడ్డులోని మాంసకృత్తులూ, విటమిన్‌ బి(బయోటిన్‌) జుట్టు బాగా ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడతాయి. పోషణ అందిస్తాయి. అలాగే పెరుగులోని విటమిన్‌ బి5, విటమిన్‌ డి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. ఇంకా ఓట్స్‌లో పీచు, జింక్, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.