మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (13:23 IST)

పెరుగు, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

జిడ్డుచర్మం ఉన్నవాళ్లు నాలుగైదు బాదంగింజలు తీసుకుని రాత్రంతా నీళ్లలో నానపెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని పేస్ట్ చేసుకుని.. అందులో అరస్పూన్ తేనె కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే జిడ్డుపోయి చర్మం మెరుస్తుంది. రోజూ ఓట్‌మీల్ పిండిని పెరుగులో కలిపి ముఖానికి రాసుకునట్లైతే ముఖచర్మం మృదువుగా మారుతుంది.
 
ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్, స్పూన్ నిమ్మరసం ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, పాదాలకు పట్టించిన తరువాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగినట్లైతే ముఖం మృదువుగా మారి ఆకర్షణీయంగా వుంటుంది.
 
కప్పు మెంతులు నానబెట్టుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, స్పూన్ పసుపు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు క్రమంగా చేస్తే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది.