శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (17:09 IST)

బియ్యం నీటిలో కాస్త నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

బియ్యం కడిగిన నీటిలో గల సౌందర్య చిట్కాలను తెలుసుకుందాం. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 3 స్పూన్స్ రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి రాసుకుంటే సహజసిద్ధమైన కోమలమైన అందాన్ని పొందవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చే

బియ్యం కడిగిన నీటిలో గల సౌందర్య చిట్కాలను తెలుసుకుందాం. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 3 స్పూన్స్ రోజ్‌వాటర్‌ను కలిపి ముఖానికి రాసుకుంటే సహజసిద్ధమైన కోమలమైన అందాన్ని పొందవచ్చును. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. 2 స్పూన్స్ బియ్యం నీటిలో 1 స్పూన్ గ్రీన్ టీని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్న ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి.
 
ఇలా చేయడం ప్రకాశవంతమైన మెరిసే చర్మాన్ని పొందవచ్చును. అదే మోతాదు బియ్యం నీటిలో స్పూన్ తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. అంతే మెుటిమల చర్మం కాస్త మృదువుగా మారుతుంది. కలబంద గుజ్జులో కాస్త బియ్యం నీటిని కలుపుకుని ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 
ఈ విధంగా చేయడం వలన మృదువైన, కోమలమైన చర్మాన్ని పొందవచ్చును. వారానికి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పాలు పౌడర్‌లో బియ్యం నీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

చివరగా 4 స్పూన్ల బియ్యం నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును.