ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (13:07 IST)

కళ్ల కిందటి నల్లటి వలయాలకు ఉప్పుతో చెక్.. ఎలాగో తెలుసుకోండి..

ఉప్పును సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే వారికి, కంటి గ్లాసులు ధరించే వారికి కంటి కింద నల్లటి వలయాలు తప్పనిసరి. అలా కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే... గోరువెచ్చని నీటిలో

ఉప్పును సౌందర్య సాధనంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే వారికి, కంటి గ్లాసులు ధరించే వారికి కంటి కింద నల్లటి వలయాలు తప్పనిసరి. అలా కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే... గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. నీళ్లలో ముంచిన దూదిని తీసుకుని కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. 
 
అలాగే ఉప్పు మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి సహాయపడుతుంది. ఉప్పు సహజసిద్ధమైన క్లెన్సర్. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలుపుకోవాలి. స్ప్రే బాటిలో నిల్వ చేసుకుని ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ముఖంపై స్ప్రే చేసి.. తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. 
 
ఉప్పు, లవంగనూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది.