శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (10:23 IST)

చర్మం నిర్జీవంగా మారిందా? ఈ చిట్కాలు పాటించండి..

చర్మం నిర్జీవంగా మారిందా? పేలవంగా తయారైందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. ముందుగా చర్మంపై నున్న మృతకణాలను దూరం చేసుకోవాలి. అందుకు పంచదారను ఉపయోగించాలి. ఇది చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడమే కాకుండా దాని

చర్మం నిర్జీవంగా మారిందా? పేలవంగా తయారైందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. ముందుగా చర్మంపై నున్న మృతకణాలను దూరం చేసుకోవాలి. అందుకు పంచదారను ఉపయోగించాలి. ఇది చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడమే కాకుండా దానికి పోషణను అందిస్తుంది. 
 
ఒక పెద్ద చెంచా చక్కెరలో కొన్ని చుక్కల నీటిని కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి వేళ్లతో పది నిమిషాలపాటు మృదువుగా మర్దనా చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఆ తర్వాత తేనె, ఓట్స్, గుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి పూతలా రాసి మృదువుగా మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఓసారి చేస్తుంటే చర్మం మెరిసిపోతుంది.
 
అలాగే వారానికోసారి ఆలూ ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. బంగాళాదుంపను చక్రాల్లా కోసి ముఖంపై మృదువుగా రుద్దాలి. దానిలోని రసం చర్మంలోకి ఇంకి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అరగంట సేపు వుంచి కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.