గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (16:59 IST)

మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు?

bank holiday
2023 సంవత్సరంలో మొదటి రెండు నెలలు గడిచిపోయాయి. మూడో నెల మార్చిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చివరి నెల కూడా ఇదే. అయితే, ఈ నెలలో 12 రోజుల పాటు బ్యాంకు సెలవులు రానున్నాయి. వీటిలో ఉగాది, శ్రీరామ నవమి, హోలీ పండుగలు ఉన్నాయి. మార్చి నెలలో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగో శనివారం ఉంది. ఇవికాకుండా జాతీయ సెలవుదినాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుంటే మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుల వివరాలను పరిశీలిస్తే, 
 
మార్చి 3వ తేదీ శుక్రవారం (చుప్ చార్ కుట్ - త్రిపుర రాజధాని అగర్తలలో సెలవు).
మార్చి 5వ తేదీ ఆదివారం.
మార్చి 7వ తేదీ మంగళవారం హోలీ (బెలాపూర్, గౌహతి, తెలంగాణ,ఏపీ, డెహ్రాడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, రాంచీ, శ్రీనగర్‌లలోని బ్యాంకులకు సెలవు).
మార్చి 8వ తేదీ హోలీ బుధవారం (అగర్తల, ఐజ్వాల్, అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లాలలో బ్యాంకులకు సెలవు).
 
మార్చి 9వ తేదీ హోలీ గురువారం (పాట్నాలో బ్యాంకులకు సెలవు).
మార్చి 11వ తేదీ రెండో శనివారం.
మార్చి 12వ తేదీ ఆదివారం.
మార్చి 19వ తేదీ ఆదివారం.
మార్చి 22వ తేదీ బుధవారం తెలుగు సంవత్సరాది ఉగాది. బీహార్ దివస్. బ్యాంకులకు సెలవు.
మార్చి 26వ తేదీ ఆదివారం.
మార్చి 30వ తేదీ గురువారం శ్రీరామనవమి.