ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (10:22 IST)

బంగారం ధరలు తగ్గుముఖం.. వెండి ధర మాత్రం కాస్త పైకి కదిలింది

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా మరోసారి పసిడి ధర కిందకు దిగివచ్చింది. వరుసగా రెండు రోజులు కాస్త పైకి కదిలిన బంగారం ధర.. బుధవారం మళ్లీ కిందకు దిగింది.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గడంతో.. రూ.45,440కు దిగివచ్చింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి.. రూ.41,650కి పరిమితమైంది.
 
అయితే వెండి ధర మాత్రం కాస్త పైకి కదిలింది.. రూ. 100 పెరిగి రూ.71,100కు చేరింది కిలో వెండి ధర.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గుదలతో 1714 డాలర్లకు క్షీణించగా.. వెండి ధర ఔన్స్‌కు 0.53 శాతం క్షీణతతో 26.04 డాలర్లకు దిగివచ్చింది.
 
అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 350 రూపాయలు తగ్గి 43,800 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల కనబరిచింది. ఇక్కడ 380 రూపాయలు తగ్గి 47,780 రూపాయల వద్దకు చేరుకుంది. 
 
ఇక ఢిల్లీలో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 100 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 66 వేల రూపాయల స్థాయిలో నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయలుగా నమోదు అయింది.