శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (11:50 IST)

స్థిరంగా పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలకు రెక్కలు

పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర, డాలర్ విలువ, రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీరేట్లు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భౌగోళిక పరిస్థితులు బంగారం ధరల మార్పుకు కారణమవుతోంది. 
 
మొన్నటి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ అతి స్వల్పంగా పెరిగింది. గ్రాముకు రూపాయి చొప్పున బంగారం ధర పెరిగింది. అయితే బంగారం ధరల్లో పెరుగుదల దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. కొన్ని నగరాల్లో ఎక్కువగానే పెరిగింది. 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 46 వేల 910 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 51 వేల 170 గా న‌మోదైంది. మరోవైపు కిలో వెండి ధర 61 వేల 600 రూపాయలుగా ఉంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంది. హైద‌రాబాద్ న‌గరంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధ‌ర 44 వేల 760 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల దర 48 వేల 830 రూపాయలుగా వుంది. వెండి ధర మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.  ఇక్కడ కిలో వెండి 65 వేల 5 వందల రూపాయలుగా ఉంది.