సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (17:45 IST)

సికింద్రాబాద్ నుండి అయోధ్య, కాశీ-పూరీలకు పర్యాటక రైళ్లు

Ayodhya Ram lalla
ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్ నుండి అయోధ్య, కాశీ-పూరీలకు పర్యాటక రైళ్లను నడపనుంది. ఈ యాత్ర సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులకు ఈ పవిత్ర దేవాలయాలను సందర్శించుకునేలా చేస్తుంది. 
 
మార్చి 23 నుండి సికింద్రాబాద్ నుండి ప్రారంభమయ్యే పూరీ-కాశీ-అయోధ్య టూరిజం ప్యాకేజీతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను ‘పుణ్య క్షేత్ర యాత్ర’ నడపాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రతిపాదించింది.
 
ఇది ఆహారం, స్థానిక ప్రయాణం, వసతితో సహా తొమ్మిది రోజుల పర్యటనగా వుంటుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు ఈ ప్రయాణం వుంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. సికింద్రాబాద్, పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లను ఈ టూర్ కలుపుతుంది. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్, పెందుర్తి , విజయనగరం వంటి బోర్డింగ్ లేదా దిగే స్టేషన్‌లు ఉన్నాయి. రైలు మొత్తం 716 సీట్లను కలిగి ఉంటుంది.