శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (13:26 IST)

ఓలా డ్రైవర్లకు కొత్త ఫీచర్.. అదేంటంటే?

Ola
ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్‌ సంస్థ ఓలా డ్రైవర్లకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. డ్రైవర్లు అందించిన సేవలకు కృతజ్ఞతగా వినియోగదారులు అదనపు మొత్తం(టిప్‌) చెల్లించే ఫీచర్‌ను యాప్‌లో జోడించామని, డ్రైవర్ల ఆదాయాన్ని పెంచడానికి ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. 
 
భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌ దేశాల్లోని ఓలా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫీచర్‌తో ప్రపంచ వ్యాప్తంగా 25లక్షల మందికి పైగా డ్రైవర్లకుు ప్రయోజనం చేకూరనుంది. ఓలా ప్రధాన ప్రత్యర్థి ఉబెర్‌ టిప్పింగ్‌ ఫీచర్‌ను రెండేళ్ల క్రితమే ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరిలో భారత్‌లో కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.