శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (09:45 IST)

ఆ తేదీ లోపు లింకు చేయకపోతే పాన్ కార్డు నిరుపయోగం... ఐటీ శాఖ

pan card link
పాన్ కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసేందుకు ఆదాయ పన్నుశాఖ ఇప్పటికే పలు దఫాలుగా డెడ్‌లైన్లు ఇచ్చింది. ఈ గడువులను పొడగించింది కూడా. ఇపుడు మరోమారు 2023 మార్చి 31వ తేదీ వరకు తుది గడువుగా ప్రకటించింది. వచ్చే యేడాది మార్చి 31వ తేదీలోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పని చేయదని కేంద్రం స్పష్టం చేంది. దీనిపై ఆదాయపన్ను శాఖ కూడా మరోమారు వివరణ ఇచ్చింది.
 
ఐటీ చట్టం 1961 ప్రకారం పన్ను మినహాయింపు పరిధిలోకి రానువారు తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విధించిన సాధారణ గడువు ముగిసిందని, గడువు పొడగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్‌తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన చేసింది.