శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (09:40 IST)

ఈ వారంలో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వారంలో మూడోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై 80పైసల చొప్పున వడ్డించాయి. మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌, డీజిల్ ధరలు రూ.2.60పైగానే పెరిగాయి
 
తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఎలా వున్నాయంటే...
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07గా వుంది. అలాగే ముంబైలో పెట్రోల్ ధర రూ.112.51, డీజిల్ ధర రూ.96.70గా,  చెన్నైలో పెట్రోల్ ధర రూ.103.67, డీజిల్ ధర రూ.93.71గా వుంది. 
 
ఇకపోతే.. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ ధర రూ.97.23గా.. గుంటూరులో పెట్రోల్ ధర రూ.112.96, డీజిల్ ధర రూ.98.94గా, విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.111.66, డీజిల్ ధర రూ. 97.68గా వుంది.