ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (10:36 IST)

అదుపుతప్పిన పెట్రోల్ ధరలు: అక్టోబర్ నెలలో 6 రూపాయలకు పైగా..?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు భారంగా మారుతోంది. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అక్టోబర్ నెలలో 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటివరకు అక్టోబర్ నెలలో 6 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
 
కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ లేహ్‌లో డీజిల్ ధర 100 దాటేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్‌లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరగగా.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 107.24, డీజిల్ రూ. 95.97 పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.55, డీజిల్ రూ.104.70గా ఉంది.