గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (09:32 IST)

కిందికి దిగివస్తున్న బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి. ఇటీవల ఆకాశాన్ని తాకిన ఈ ధరలు సంవత్సరాంతంలో మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. సోమవారం ఈ ధరల్లో ఎలాంటి మార్పులేదు. 
 
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,850గా ఉంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,700గా ఉంది. అలాగే, వెండి ధరలు కూడా తగ్గాయి. దీని ధర రూ.100 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.66 వేలుగా ఉంది. 
 
మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరల్లో మార్పు కనిపించింది. ఔన్స్ బంగారం ధర 0.15 శాతంగా తగ్గి 18.02 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 0.81 శాతం తగ్గుదలతో 22.34 డాలర్లగా ఉంది.