శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (17:18 IST)

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పరీక్షల రీ షెడ్యూల్ జారీ

exam
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల రీ-షెడ్యూల్ తేదీను తాజాగా ప్రకటించారు. మే నెల 8, 9, 21వ తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షలను మే 8న అగ్రికల్చర్ ఇంజనీర్లకు సంబంధించిన పరీక్షను మే 9న నిర్వహిస్తారు. సివిల్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన పరీక్షను మే 21వ తేదీన ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించాలని నిర్వహించారు.