ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (13:38 IST)

నిరుద్యోగుల వినతులకు తలొగ్గిన టీఎస్పీఎస్సీ : ఆ నోటిఫికేషన్‌ను రద్దు

jobs
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బ్యాడ్ న్యూచ్ చెప్పింది. గత జూలై 27వ తేదీన రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను తాజాగా రద్దు చేసింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల విషయంలో అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. 
 
ఈ నోటఫికేష్ విడుదలైన తేదీ నాటికి హెవీ మోటార్ లైసెన్స్ ఉండాలన్న నింబంధన ఉండటంతో లైసెన్సు పొందని వారు తాము అనర్హులమవుతామని వాపోయారు. దీంతో మహిళా అభ్యర్థులు కూడా లైసెన్స్ కలిగివుండాలన్న నిబంధనపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్హతల్లో కొంత మార్పులు చేర్పులు చేసేందుకు సమయం కావాలని కమిషన్‌కు రవాణా శాక కోరింద. దీంతో జూలై 2022 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీచేశారు.