గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:58 IST)

ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ 2021, ఇంటర్ విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్

డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుగంటున్న IX - XII తరగతి విద్యార్థులు నీట్‌, ఐఐటీ-జెఈఈ కోచింగ్‌ పొందేందుకు పరీక్ష సన్నద్ధత సేవల్లో జాతీయస్థాయి సంస్థ అయిన ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎఈఎస్‌ఎల్) ప్రతిష్ఠాత్మక వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్ష ఆకాశ్‌ నేషనల్‌ టాలెంట్ హంట్‌ ఎగ్జామ్‌ (ఎఎన్‌టీహెచ్‌ఈ) 2021, పన్నెండవ ఎడిషన్‌ ద్వారా 100% వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తోంది.
 
ఎఎన్‌టీహెచ్‌ఈ 2021 పరీక్ష ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లో డిసెంబర్‌ 4-12, 2021 మధ్య దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించబడును. ట్యూషన్‌ ఫీజుపై స్కాలర్‌షిప్‌తో పాటు అత్యుత్తమ స్కోర్‌ చేసిన వారికి నగదు బహుమతులు కూడా ప్రదానం చేయబడతాయి.
 
ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే వివిధ గ్రేడుల్లో అత్యున్నతంగా నిలిచే ఐదుగురు విద్యార్థులు తమ తల్లిదండ్రుల్లో ఒకరితో కలిసి ఉచితంగా నాసా సందర్శించవచ్చు. ఎఎన్‌టీహెచ్‌ఈలో అర్హత సాధించే విద్యార్థులు అదనంగా మెరిట్‌ నేషన్ స్కూల్‌ బూస్టర్‌ కోర్సు ఉచితంగా పొందవచ్చు. మెరిట్‌ నేషన్‌ ఎఈఎస్‌ఎల్‌ అనుబంధ సంస్థ.
 
పరీక్ష తేదీల్లో ఉదయం 10:00 నుంచి రాత్రి 7:00 మధ్యన గంట పాటు ఎఎన్‌టీహెచ్‌ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్‌లైన్‌ పరీక్షలు డిసెంబర్‌ 5, 12 తేదీల్లో రెండు షిప్టుల్లో అంటే ఉ. 10:30 నుంచి 11:30, సాయంత్రం 4:00 - 05:00 గంటల మధ్య దేశవ్యాప్యంగా ఉన్న 215+ ఆకాశ్‌ కేంద్రాల్లో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొవిడ్‌-19 నిబంధనలకు కట్టుబడి నిర్వహించబడతాయి. విద్యార్థులు తమకు అనుకూలమైన ఒక గంట స్లాట్‌ ఎంచుకోవచ్చు.
 
ఈ పరీక్షకు మొత్తం మార్కులు 90. ఇందులో విద్యార్థుల తరగతి, వారు కోరుకుంటున్న స్ట్రీమ్‌కు సంబంధించి 35 మల్టీపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. VII-IX విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమ్యాటిక్స్, మెంటల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మెడిసిల్‌లో చేరాలనుకునే X విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అదే ఇంజినీరింగ్‌ వైపు ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అలాగే నీట్‌ను లక్ష్యంగా చేసుకున్న XI-XII విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బాటనీ, జూవాలజీ నుంచి, ఇంజినీరింగ్‌ ఆశావహులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
 
ఎఎన్‌టీహెచ్‌ఈ 2021 కోసం ఆన్‌లైన్‌లో అయితే పరీక్ష తేదీకి 3 రోజుల ముందు వరకు, ఆఫ్‌లైన్‌లో అయితే పరీక్ష తేదీకి 7 రోజుల ముందు వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.99. దీనిని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు లేదా మీ సమీపంలోని ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్‌ కేంద్రంలో నేరుగా చెల్లించవచ్చు.
 
ఎఎన్‌టీహెచ్‌ఈ 2021 కు సంబంధించి X-XII తరగతి విద్యార్థుల ఫలితాలు జనవరి, 02, 2022, IX విద్యార్థుల ఫలితాలు జనవరి 04, 2022న ప్రకటించబడతాయి. ఎఎన్‌టీహెచ్‌ఈ 2021, పై ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎఈఎస్‌ఎల్) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ చౌదరి మాట్లాడుతూ, “డాక్టర్లు, ఐఐటీయన్లు కావాలనే కలలను సాకారం చేస్తుంది కాబట్టే ఎఎన్‌టీహెచ్‌ఈ ఏటా విద్యార్థుల నుంచి సహజంగానే అనూహ్యమైన స్పందనను, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. మెడికల్‌ కాలేజీల్లోనూ, ఐఐటీ, ఎన్‌ఐటీ లేదా  కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించే కళాశాల్లో సీటు సాధించేందుకు విద్యార్థులకు కోచింగ్‌ ఎంతోగానో ఉపకరిస్తుంది.
 
మేమందించే అత్యంత విలువ కలిగిన కోచింగ్‌ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన, అందుకోలేని విద్యార్థులకు చేరువ చేయాలనే సంకల్పంతో  2010లో ఎఎన్‌టీహెచ్‌ఈకు రూపకల్పన చేశాం. విద్యార్థులు ఎక్కడున్నా వారి వారి వేగానికి అనుగుణంగా నీట్‌, ఐఐటీ-జెఈఈ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎఎన్‌టీహెచ్‌ఈ కల్పిస్తుంది. గతంలో మాదరిగానే ఎఎన్‌టీహెచ్‌ఈ 2021ని కూడా లక్షలాది మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకొని తమ ఉజ్వల భవిష్యత్‌ పదిలం చేసుకునేందుకు ఒక కీలకమైన అడుగు వేస్తారని మేము విశ్వసిస్తున్నాం” అన్నారు.