1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:40 IST)

నీట్‌- జెఈఈ 2021 కోసం ఫైనల్‌ను ప్రకటించిన ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య

ఆగస్టు 18 మరియు ఆగస్టు 30,2021 తేదీలలో ఫైనల్‌ (ఫైనల్‌ ఇన్ఫినిటీ నేషనల్‌ లెర్నర్స్‌ ఎగ్జామ్‌)ను నిర్వహించబోతున్నట్లు ఇన్ఫినిటీ లెర్న్‌ బై శ్రీ చైతన్య  ప్రకటించింది. దీనిలో భాగంగా విద్యార్థులు తమంతట తాముగా నమోదు చేసుకోవడంతో పాటుగా నమూనా పరీక్షలు రాయడం, గత సంవత్సరాల పరీక్షా పత్రాలకు సమాధానాలు రాయడం తదితర అంశాలను చేయవచ్చు. సెప్టెంబర్‌ 12 ,2021న జరిగే నీట్‌ పరీక్షలలో మంచి ర్యాంక్‌ సాధించేందుకు సన్నాహకంగా ఇది ఉంటుంది.
 
ఈ పరీక్షలు కేవలం విద్యార్థులు అత్యుత్తమంగా సిద్ధమయ్యేందుకు మాత్రమే సహాయపడటం మాత్రమే కాదు, టాప్‌ 1000 విద్యార్థులలో తాముండగలమో లేదో కూడా తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. విద్యార్థులు తమ హాల్‌ టిక్కెట్‌ నెంబర్‌ (నీట్‌ పరీక్షకు సంబంధించినది) ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు ఒకే ఒక్క అర్హత అది. అదనంగా విద్యార్థులు నామమాత్రపు రుసుము 99 రూపాయలను పరీక్ష కోసం చెల్లించాల్సి ఉంటుంది.
 
మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌, టాప్‌ 10 విద్యార్థులకు 5 లక్షల రూపాయల వరకూ గెలుచుకునే అవకాశం, టాప్‌ 100 విద్యార్థులకు 1లక్ష రూపాయల వరకూ బహుమతులు అందుకునే అవకాశంతో పాటుగా 101-1000 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 25 వేల రూపాయల వరకూ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం infinitylearn.com చూడవచ్చు.
 
ఇన్ఫినిటీ లెర్న్‌ సీఈవో- ఉజ్వల్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘‘ప్రశ్నించే మనస్తత్వం ప్రోత్సహించే ఆన్‌లైన్‌ అభ్యాస వాతావరణాన్ని ప్రోత్సహించడంతో పాటుగా తాము హాజరయ్యే పరీక్షలలో సత్తా చాటగలమా లేదా అన్నది బేరీజు వేసుకునేందుకు సహాయపడుతూ పలు పరీక్షలను సైతం నిర్వహించే ప్రక్రియను కొనసాగిస్తున్నాం. నిజానికి నీట్‌ పరీక్షల నూతన నమూనాలో ఎన్‌టీఏ చేత 48 గంటలలో ఫలితాలను ప్రకటించే రీతిలో పరీక్షను నిర్వహిస్తున్న మొట్టమొదటి వేదికగా మేము నిలిచాం’’ అని అన్నారు.