మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (14:24 IST)

కర్నాటకలో రాజుకున్న వివాదం : నిషేధం విధించాలంటూ ఆందోళనలు

రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించగా, అలియాభట్ హీరోయిన్. ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కన్నడిగులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఆర్ఆర్ఆర్" చిత్రం కన్నడలో విడుదల చేయడం లేదని, తమ భాషలో విడుదలకానపుడు ఇతర భాషల్లో కూడా విడుదల కాకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇటీవల కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని కన్నడంలో విడుదల చేయకపోవడం తమను అవమానించడమేని కర్నాటక ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో #BoycottRRRinKarnataka అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.