శనివారం, 2 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 నవంబరు 2014 (15:20 IST)

పూరీలు క్రిస్పీగా ఉండాలంటే.. ఫ్రిజ్‌లో ఉంచండి!!

చాలా మందికి పూరీలు అంటే ఎంతో ఇష్టం. అయితే, ఈ పూరీలు మరింత క్రిస్పీగా ఉంటే భలే ఉంటుంది. ఇలా ఉండేందుకు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు. 
 
పూరీల కోసం సిద్ధం చేసుకున్న పిండిని గుండ్రంగా తయారు చేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేసినట్టయితే, కాల్చే సమయంలో నూనెను తక్కువగా పీల్చడంతో పాటు.. ఎంతో క్రిస్పీగా ఉంటాయి. 
 
అలాగే, ఎక్కువ రోజులు నిల్వవున్న శెనగపిండిని చెత్తలో పారేయకుండా దాన్ని పాత్రలు తోమడానికి ఉపయోగిస్తే గిన్నెలు మరింతగా మెరుస్తాయి.