బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (12:14 IST)

ఉల్లిగడ్డలు కట్‌ చేసేముందుగా వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే?

ఎంతటి పెద్దవారైన ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు కళ్లల్లో నీళ్లు కారిపోతుంటాయి. ఉల్లిగడ్డలోని సల్ఫర్ వలన వాటిని కోసేటప్పుడు కళ్లు మండుతుంటాయి. అలాంటి సమస్యనుండి విముక్తి చెందుటకు కొన్ని చిట్కాలు తెలుసుకుం

ఎంతటి పెద్దవారైన ఉల్లిగడ్డలు కోస్తున్నప్పుడు కళ్లల్లో నీళ్లు కారిపోతుంటాయి. ఉల్లిగడ్డలోని సల్ఫర్ వలన వాటిని కోసేటప్పుడు కళ్లు మండుతుంటాయి. అలాంటి సమస్య నుండి విముక్తి చెందుటకు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
 
ఉల్లిగడ్డను కోసేటప్పుడు దానిలోగల ఎంజైమ్స్ గాలిలోకి వెళ్లి కళ్లను మండిస్తాయి. అందువలన వాటిని తరిగేటప్పుడు పదునైన కత్తితో వీలైనంత త్వరగా కట్‌ చేసుకోవాలి. వీటిని కోసేముందు కాసేపటి వరకు ఉల్లిగడ్డలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టడం వలన దానిలో గల ఎంజైమ్స్ ప్రభావం తగ్గిపోతుంది. కాసేపటి వాడిని తీసి కట్‌చేసుకుంటే ఎలాంటి సమస్యలు దరిచేరవు.
 
అలాకాకుంటే కళ్లకు టైట్ గాగుల్స్ లేదా కూలింగ్ గ్లాసెస్ వేసుకుని కట్‌ చేసుకుంటే కూడా మంచిదే. అప్పుడే ఆ గాలి కళ్లలోకి చేరకుండా ఉంటుంది. ఉల్లిగడ్డలు ‌కట్‌ చేసెటప్పుడు కిటికీ లేదా ఫ్యాన్‌కి దగ్గరగా కూర్చుని కట్‌చేసుకుంటే ఆ గాలికి వాటి నుండి వెలువడే ఎంజైమ్స్ కళ్లకు చేరకుండా ఉంటాయి.