శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (12:46 IST)

యాదగిరిగుట్ట ఠాణా పోలీసులపై కరోనా పంజా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరింది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన ఆంక్షలను అమలు చేస్తుంది. అయినప్పటికీ అనేక మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. 
 
తాజాగా భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పోలీస్ ఠాణాపై కరోనా పంజా విసిరింది. ఈ స్టేషన్‌‌లో పనిచేసే పోలీసుల్లో ఏకంగా 12 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, పది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరందరికీ పాజిటివ్‌గా తేలడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. 
 
దేశ వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తుండగంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.