సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (13:49 IST)

ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసు

ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో హస్తినలో మొత్తం నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది. ఈ కేసులతో కలుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 77కు చేరింది. 
 
మరోవైపు, ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన ఒమిక్రాన్ బాధితులను లోక్‌నారాయణ్ జయప్రకాష్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక రోగి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇదిలావుంటే, ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఢిల్లీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ రాజధాని పరిధిలో నిషేధాజ్ఞలు విధించింది. ఈ ఆంక్షలు వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయి. అలాగే, బార్లు, రెస్టారెంట్లలో 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవాలని సూచన చేసింది.