ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (22:30 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. తెలంగాణలో 162, ఏపీలో 624 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 33,506 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,67,887కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,930కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 214 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,235 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 38,312 పరీక్షలు నిర్వహించగా.. 624 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,57,252 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా నలుగురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,254కి చేరింది. 810 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,35,054కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,944 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,44,941 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.