సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (11:48 IST)

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మృతులు 58.66 లక్షలు

గత 2019లో చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన కరోనై వైరస్ మహమ్మారి అనేక లక్షల మంది ప్రాణాలు తీసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 58.66 లక్షలను దాటింది. ఈ వైరస్ వెలుగు చూసిన అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 5,866,885 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా బాధితులు 417,885,540 మంది బాధితుల్లో 338,396,416 మంది కోలుకున్నారు. ఇంకా 84,604 మంది ఆందోళనకు గురైన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
మరోవైపు, గడిచిన 24 గంటల్లో భారత్‌లో 30757 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 541 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 67538 మంది విముక్తిపొందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,32,918 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,19,10,984 మంది కోలుకున్నారు.