గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (21:49 IST)

ఏపీలో కొత్తగా 4,038 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 4,038 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 73,767 శాంపిళ్లను పరీక్షించగా 4,038 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 5,622 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
చిత్తూరు జిల్లాలో 9, ప్రకాశం 7, కృష్ణా 5, ర్పుగోదావరి4, గుంటూరు3, కడప3, విశాఖపట్నం3, అనంతపురం, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,71,503కి చేరింది.
 
ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6,357కి చేరింది. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,22,204గా వుంది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్పత్రులలో 40,047 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 68,46,040 మంది నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.