శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (09:16 IST)

బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. ఏ విషయంలో..?

బ్రెజిల్‌ను భారత్ అధికమించింది. అభివృద్ధిలో కాదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో. ఫలితంగా ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రెండో దేశంగా భారత్ చోటుదక్కించుకుంది. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41,97,563కు చేరింది. దీంతో 41.23 లక్షల కేసులున్న బ్రెజిల్‌ మూడోస్థానానికి వెళ్లగా.. భారత్‌ రెండోస్థానాన్ని అక్రమించింది. 
 
తొలిస్థానంలో ఉన్న అమెరికాలో 64,47,133 మంది వైరస్‌ బారిన పడ్డారు. భారత్‌లో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా రికార్డుస్థాయిలో 90,632 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావటం ప్రపంచంలోనే ఇది తొలిసారి. 
 
ఇప్పటివరకూ భారత్‌లో 31,80,865 మంది రోగులు కోలుకోగా, 8,62,320 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1065 మంది ప్రాణాలు కోల్పోవడంతోమొత్తం మృతుల సంఖ్య 70,626కు చేరుకున్నది. మృతుల రేటు 1.72 శాతానికి తగ్గింది.