సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (11:46 IST)

స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు-పెరిగిన మరణాలు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,68,063 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. కరోనా ధాటికి 277 మంది ప్రాణాలు విడిచారు.  69,959 మంది కొవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో 4,461కు చేరింది. 
 
ఇండియా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,68,063 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే 11,660 కేసులు తగ్గాయి. కరోనా వల్ల మరో 277మంది మృతి చెందినట్లు పేర్కొంది. 
 
మరోవైపు 69,959 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది. కోవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,461కు చేరింది.