శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (17:04 IST)

నౌకలో కరోనా.. 800 మందికి కోవిడ్ పాజిటివ్.. ఎక్కడ?

Ship
Ship
కరోనా పలు దేశాల్లో మాత్రం కోరలు చాస్తోంది. తాజాగా న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న నౌకలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో మొత్తం 4,600 మంది ప్రయాణీస్తుండగా, 800 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆ నౌకను కరోనా ప్రోటోకాల్‌ను అమలు చేస్తామని కంపెనీ ప్రెసిడెంట్ మార్గరెట్ ఫిట్జెరాల్డ్ తెలిపారు. 
 
ఆస్ట్రేలియాలో సిడ్నీలో కోవిడ్ -19తో సుమారు 800 మంది ప్రయాణీకులతో కూడిన హాలిడే క్రూయిజ్ షిప్ డాక్ చేయబడింది. ఈ ప్రయాణీకులతో ఐదుగురికి ఒకరి కోవిడ్ వుందని నిర్ధారించారు. 
 
గతంలో 2020 ప్రారంభంలో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ కోవిడ్ వ్యాప్తిని గుర్తు చేస్తుంది. అప్పుడు 900 మందికిపైగా కరోనా పాజిటివ్ రాగా, 28 మంది మరణించారు.