గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (23:47 IST)

దడ పుట్టిస్తున్న కరోనా సబ్ వేరియంట్స్

Corona
కరోనా సబ్ వేరియంట్స్ దడ పుట్టిస్తున్నాయి. 11 రోజుల్లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నమోదైనాయి. ఈ మేరకు కొత్త రకం లక్షణాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఇప్పటివరకు ఉన్న లక్షణాలకు తోడు మరో లక్షణం నమోదైంది. కోవిడ్-19  XBB.1.5 వేరియంట్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో నివేదించబడింది.
 
భారతదేశంలో మొత్తం XBB.1.5వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకి పెరిగింది. అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ కేసులకు XBB.1.5వేరియంట్ కారణమన్న సంగతి తెలిసిందే. 
 
కోవిడ్-19,XBB.1.5 వేరియంట్ కేసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో నమోదయ్యాయి. గుజరాత్‌లో మూడు, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.