శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జులై 2021 (19:06 IST)

24 గంటల్లో ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులెన్ని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2714 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 74,820 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ  కేసులు వెలుగు చూశాయి. 
 
వీటిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 418 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 329, కృష్ణా జిల్లాలో 248, నెల్లూరు జిల్లాలో 246, ప్రకాశం జిల్లాలో 233, పశ్చిమ గోదావరి జిల్లాలో 209 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, 2,737 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,241కి పెరిగింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 19,52,513 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19,16,914 మంది కరోనా నుంచి కోలుకున్నారు.