ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో స్పల్పంగా పెరిగిన పాజిటివ్ కేసులు .. 313 మంది మృతి

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో స్వల్పంగా పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం గత 24 గంటల్లో ఈ కేసుల వివరాలతో కూడిన మీడియా బులిటెన్‌ను విడుదల చేసింది. 
 
ఆ ప్రకారం గడిచిన 24 గంటల్లో మొత్తం 10488 పాజిటివ్ కరోనా కేసులు నమోదుకాగా, 313 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఈ వైరస్ బారినపడి కోలుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 12329 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. దేశంలో ఈ స్థాయిలో రికవరీలు పెరగడం గత యేడాది మార్చి నెల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
అదేసమయంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అంటే 0.36 శాతానికి తగ్గి 536 రోజుల కనిష్టానికి పడిపోయాయి. ప్రస్తుతం ఈ పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,714గా వుంది. అలాగే, శనివారం దేశ వ్యాప్తంగా 10,74,099 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.