శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:50 IST)

తెలంగాణలో కరోనా.. 24 గంటల్లో 612 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 612 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,76,516 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,485 మంది మృతి చెందారు. తాజాగా 502 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,67,427 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,604 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 5,511 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.71శాతం ఉండగా, దేశంలో 94.8శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 144 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.