సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (09:45 IST)

రాస్ టేలర్‌ హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడు.. ఆధార్ ఇవ్వండి.. సెహ్వాగ్

ట్విట్టర్‌లో సెటైర్లు విసురుతూ.. ఆకట్టుకునే ట్వీట్లు చేసే టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా న్యూజిలాండ్‌ స్టార్ క్రికెటర్ రాస్‌ టేలర్‌‌పై పడ్డాడు. రాస్ టేలర్‌కు ఆధార్‌ కార్డు ఇవ

ట్విట్టర్‌లో సెటైర్లు విసురుతూ.. ఆకట్టుకునే ట్వీట్లు చేసే టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా న్యూజిలాండ్‌ స్టార్ క్రికెటర్ రాస్‌ టేలర్‌‌పై పడ్డాడు. రాస్ టేలర్‌కు ఆధార్‌ కార్డు ఇవ్వాలంటూ సెహ్వాగ్ చేసిన ట్వీటుకు ఆధార్ జారీ సంస్థ స్పందించింది.

వివరాల్లోకి వెళ్తే.. కివీస్‌తో తొలి వన్డే అనంతరం ట్విట్టర్‌లో సెహ్వాగ్ స్పందించాడు. దర్జీ (టేలర్‌) గారు బాగా ఆడారు. దీపావళి గిరాకీలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. మంచి ప్రదర్శన చేశారంటూ ట్వీట్ చేశాడు. అందుకు ప్రతిగా టేలర్ కూడా స్పందించాడు. ఈసారి మీ ఆర్డర్‌‌ను ముందే పంపండి. దీపావళి కంటే ముందే మీ బట్టలు కుట్టి ఇచ్చేస్తానంటూ బదులిచ్చాడు.
 
రెండో ట్వంటీ-20లో టేలర్ విఫలం కావడంతో మరో ట్వీట్ చేసిన సెహ్వాగ్ టైలర్ దుకాణం బంద్ అయ్యిందని.. తిరువనంతపురంలో కలుద్దామంటూ ట్వీట్ చేశాడు. మూతపడ్డ ఓ టైలర్‌ దుకాణం ముందు కూర్చున్న ఫొటోను కూడా పోస్టు చేశాడు. అంతే కాకుండా టేలర్‌ హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడని తెలిపాడు. టేలర్‌ హిందీ ప్రావీణ్యానికి ముగ్ధుడినయ్యానని తెలిపిన వీరూ, అతడికి ఆధార్‌ కార్డు ఇవ్వాలని‌ అభిప్రాయపడ్డాడు. దీనిపై ఆధార్‌ కార్డు జారీ చేసే ప్రభుత్వ సంస్థ యుఐడిఏఐ స్పందిస్తూ, ఇక్కడ భాష ముఖ్యం కాదని ఎక్కడ నివసిస్తారనేదే ముఖ్యమని పేర్కొంది.