సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (13:36 IST)

రాజకీయాల్లోకి అంబటి రాయుడు.. ఏ పార్టీ ఆఫర్ ఇచ్చిందో?

టీమిండియా నుంచి ఇటీవలే రిటర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. అంబటి రాయుడుకు ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న ఒక ప్రముఖ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని తెలుస్తుంది. 
 
మరోవైపు ఇప్పటికే మాజీ క్రికెటర్ వేణుగోపాల రావు.. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. అంతే కాకుండా కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో చురకుగా పనిచేశాడు.
 
కానీ వేణు గోపాల్ రావు.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జనసేన పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఆయనన మరోసారి జనసేన పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి రానుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది