శుక్రవారం, 24 అక్టోబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2025 (12:07 IST)

మీరు ఓడిపోయారు... ఇక ఇంటికి వెళ్ళండి... బై బై పాకిస్థాన్... భారత మహిళా అభిమాని స్పందన (వీడియో)

indian pakistan match
ఆసియా క్రికెట్ టోర్నీలో టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సూపర్-4 మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ మరోమారు చిత్తుగా ఓటమిపాలైంది. భారత్ ఆరు వికెట్లు తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్ తర్వాత భారత మహిళా క్రికెట్ అభిమాని స్పందించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓడిపోయిన పాకిస్థాన్ ఆటగాళ్ళను ఉద్దేశించి ఆ మహిళ వీరాభిమాని చేసిన కామెంట్స్.. చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే, మ్యాచ్ ముగిశాక పాకిస్థాన్ క్రీడాకారులు మైదానం వీడి పెవిలియన్‌కు వెళ్తున్నారు. అదేసమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఓ భారత యువతి, వారిని రెచ్చగొట్టేలా గట్టిగా అరవడం ప్రారంభించింది. 'మీరు ఓడిపోయారు... ఇక ఇంటికి వెళ్ళండి... బై బై పాకిస్థాన్' అంటూ హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోనులో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ అయింది.
 
ఈ వీడియో చూసిన భారత అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ యువతి పాకిస్థాన్ జట్టు పరువు తీసిందంటూ కామెంట్లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన ఈ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్ప 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి సునాయాసంగా గెలుపొందింది. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ తమ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.