సల్మాన్ ఖాన్ మద్దతు.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీశాంత్..?
హిందీ బిగ్ బాస్‌లో మాజీ టీమిండియా బౌలర్ శ్రీశాంత్ కంటిస్టెంట్‌గా వున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి.. శ్రీశాంత్ వివాదాలకు తావిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ సీజన్ 12లో వున్న శ్రీశాంత్‌కు మద్దతు లభించింది.
సల్మాన్ ఖానే శ్రీశాంత్‌కు మద్దతు ప్రకటించాడు. దీంతో శ్రీ కంటివెంట నీళ్లు ధారగా ప్రవహించాయి. సల్మాన్ నుంచే తనకు సపోర్ట్ దొరకడంతో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్వటం మొదలెట్టేశాడు.
ఇంతకీ ఏమైందంటే.. లగ్జరీ బడ్జెట్ టాస్కులో భాగంగా హౌస్ మేట్స్ శ్రీశాంత్ పట్ల వ్యవహరించిన తీరుపై సల్మాన్ ఫైర్ అయ్యాడు. శ్రీశాంత్ క్రికెటర్‌గా భారత జట్టుకు ఎంతో చేశాడని.. అతని గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారని ఇతర కంటిస్టెంట్ రోహిత్, సురభిలపై సల్మాన్ మండిపడ్డాడు.
శ్రీశాంత్‌కు బిగ్ బాస్ హౌస్‌లో ఎదురైన అనుభవాలను గుర్తుచేస్తూ.. అతనితో హౌస్‌మేట్స్ వ్యవహరించిన తీరును చూపిస్తూ.. ఓ వ్యక్తిగా వాటిని తట్టుకోవడం చాలా కష్టమని సల్మాన్ చెప్తున్నట్లు గల వీడియో ప్రోమో విడుదలైంది. దీంతో సల్మాన్ మద్దతు లభించడంతో ఆనందం తట్టుకోలేక శ్రీశాంత్ వెక్కి వెక్కి ఏడ్వటానికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.