శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. ఒక్కటంటే ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేదు..

ind vs nz
క్రికెట్ ప్రపంచంలో పొట్టి ఫార్మెట్ టీ20 క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతాకాదు. బౌలర్ సంధించే ప్రతి బంతిని సిక్సర్ లేదా బౌండరీకి తరలించేందుకు బ్యాటర్లు తమ సర్వశక్తులను ఒడ్డుతారు. అలాంటి పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు సిక్సర్ల వర్షం కురిసింది. కానీ, ఆదివారం లక్నో వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ 20లో మాత్రం ఒక్కటంటే ఒక్క సిక్స్‌ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 99 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత 100 పరుగుల టార్గెట్‌ను చేరుకునేందుకు భారత్ అష్టకష్టాలు పడింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మరో బంతి మిగిలివుండగా, భారత్ గెలుపును సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ మ్యాచ్‌లో ఒక్కటంటే ఒక్క సిక్స్‌కూడా నమోదు కాలేదు. ఫలితంగా భారత గడ్డపై ఒక్క సిక్సర్ కూడా నమోదు కానీ మ్యాచ్‌గా సరికొత్త రికార్డు నమోదైంది. ఫోర్లు మాత్రం 14 నమోదయ్యాయి. వీటిలో కివీస్ జట్టు ఆరు కొట్టగా, భారత్ ఆటగాళ్లు ఎనిమిది ఫోర్లు కొట్టారు.