శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య.. భార్యాపిల్లల ఎదుటే దారుణం..

dhamika
శ్రీలంకలో ఓ దారుణం జరిగింది. ఆ దేశ అండర్-19 క్రికెట్ జట్టుకు చెందిన మాజీ కెప్టెన్ ధామిక నిరోషణ హత్యకు గురయ్యారు. ఆయన భార్యా పిల్లల ఎదుటే దుండగులు కాల్చిచంపేశారు. తన నివాసంలో ఉండగా ఈ ఘటన చేసుకుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 
 
గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో ధామిక కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి అతడి ఇంట్లోకి చొరబడి మాజీ క్రికెటర్‌పై దాడి చేశాడు. అతడి కుటుంబం కళ్ల ముందే తుపాకీతో కాల్పులు జరిపాడు. 
 
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధామిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ధామిక భార్యాపిల్లలు ఈ ఘటన నుంచి కోలుకోలేకపోతున్నారు.