ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (22:18 IST)

ఆస్ట్రేలియాలో సిరాజ్.. తండ్రి మృతి.. అంత్యక్రియలకు కూడా రాలేని దుస్థితి

Mohammed Siraj_Father
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మృతి చెందారు. సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. ఉపిరితిత్తుల సంబంధింత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ప్రస్తుత్తం సిరాజ్ ఆస్ట్రేలియా ఉన్నారు. ఆస్ట్రేలియా టూర్‌కు ఇండియన్ జట్టులో సిరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. 
 
ప్రాక్టీస్ సెషన్స్‌ నుంచి వచ్చిన తర్వాత సిరాజ్‌కు ఈ విషయం గురించి తెలిసింది.అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో క్వారంటైన్ నిబంధనల కారణంగా సిరాజ్ తన తండ్రి అంత్యక్రియల కోసం భారత్‌కు వచ్చే అవకాశం లేదు. తండ్రి మరణవార్త విని మహ్మద్ సిరాజ్ షాక్ అయ్యాడు. తన జీవితంలో అతిపెద్ద మద్దతు కోల్పోయానని.. దేశాన్ని గర్వించేలా చేయాలనే కోరుకునే తండ్రి ఇక లేరనే వార్తను సిరాజ్ జీర్ణించుకోలేకపోతున్నట్లు కన్నీటి పర్యంతం అయ్యాడు. 
 
ఇక, యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున సిరాజ్ ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే సిరాజ్.. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఓ వీడియో ద్వారా చెప్పాడు. ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని కూడా తెలిపాడు. ప్రస్తుతం ఆయన వద్దకు వెళ్లలేని.. ఫోన్‌లో మాట్లాడుతున్నానని కన్నీరు పెట్టుకున్నాడు.