గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (20:33 IST)

ఐసీసీ ట్వీంటీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు వెల్లడి

team india
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు నెలలో ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా ప్రకటించింది. మొత్తం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ సిరీస్ కోసం జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించారు. వైఎస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. 
 
కాగా, గాయాల కారణంగా జట్టుకు దూరమైన డెత్ ఓవర్ల స్పెషలిస్టులు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లను కూడా జట్టులోకి తీసుకున్నారు. అలాగే, గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచి జట్టులో చోటు కల్పించారు. అలాగే, దినేష్ కార్తీక్‌కు కూడా అవకాశం ఇచ్చారు. 
 
మరో పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, దీపక్ చాహర్, రవీంద్ర జడేజాలకు స్థానం చోటు కల్పించలేదు. కానీ, చాహర్, షమీలను స్టాండ్‌బై ఆటగాళ్లుగా అవకాశం కల్పించారు. వీరితో పాటు శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లకు కూడా స్టాండ్‌బై ఆటగాళ్ళుగా తీసుకున్నారు. 
 
జట్టు వివరాలు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పటేల్, దీపక్ హుడా, అశ్విన్ చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.