సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (20:53 IST)

మొహాలీ టీ20 మ్యాచ్ : పాండ్యా వీరవిహారం - ఆసీస్ టార్గెట్ 209 రన్స్

hardik pandya
మొహాలీ టీ20లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. 30 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఏడు ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 209 పరుగులు చేయాల్సివుంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, టీమిండియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 2 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఇటీవల ఆసియా కప్‌ టోర్నీలో మంచి ఫామ్‌ను కొనసాగించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరడం ప్రతి ఒక్కరినీ నిరాశపరిచింది. 
 
అలాగే సూర్యకుమార్ యాదవ్ 46 పరుగులు చేశాడు. రాహుల్ 55 పరుగుల చేశాడు. మొత్తం 35 బంతులను ఎదుర్కొన్న రాహుల్.. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 13.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో వీరవిహారం చేస్తూ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాగే, సూర్యకుమార్ యాదవ్ 45, ఓపెనర్ కేఎల్ రాహుల్ 55 చొప్పున పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, నాథన్ ఎలిస్ మూడు వికెట్లు, కామెరన్ గ్రీన్‌లు ఒక వికెట్ తీశారు.