శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (16:28 IST)

ఉప్పల్ టీ20 మ్యాచ్ టిక్కెట్లన్నీ పేటీఎంలోనే విక్రయం : హెచ్ఏసీ

ind vs aus
స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ మంగళవారం నుంచి జరుగనుంది. తొలి మ్యాచ్ మొహాలీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. రెండో మ్యాచ్ ఈ నెల 23న నాగ్‌పూర్‌, మూడో మ్యాచ్ ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. అయితే, మ్యాచ్‌కు టిక్కెట్లు దొరకలేదన్న కోపంతో క్రికెట్ అభిమానులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ఏసీ)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
వీటిపై హెచ్ఏసీ స్పందించింది. ఉప్పల్ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని టిక్కెట్లను పేటీఎం విక్రయిస్తున్నట్టు తెలిపింది. అలాగే పాసులు కావాలని పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమను ఒత్తిడి చేస్తున్నారన్న వార్తలు అవాస్తమని తెలిపింది. టిక్కెట్ల విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలను అరికట్టడానికే మొత్తం టిక్కెట్ల విక్రయాన్ని పేటీఎంకు అప్పగించి, పారదర్శకంగా అమ్మకాలు సాగేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 
 
కాగా, పేటీఎం తొలి దఫాలో కొన్ని టిక్కెట్ల విక్రయం చేపట్టగా అవి క్షణాల్లో మాయమైపోయాయి. ఈ నెల 15వ తేదీన ఈ టిక్కెట్లను అందుబాటులో ఉంచగా కొన్ని క్షణాల్లోనే మాయమైపోయాయి. మొదటి దశలో విక్రయానికి పెట్టిన అన్ని టిక్కెట్లు అమ్మడుపోయాయని పేటీఎం ప్రకటించింది. ఈ కారణంగానే హెచ్.ఏ.సిపై విమర్శలు రావడంతో అది స్పందించిందిం.