బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

బంగ్లాతో తొలి టెస్ట్.. భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో ఉమేశ్‌కు చోటు

cricket balls
బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు బుధవారం ఆతిథ్య జట్టుతో తొలి టెస్టు ఆడుతోంది. ఇందుకోసం ప్రకటించిన తుది జట్టులో ఉమేశ్ యాదవ్‌కు చోటు కల్పించారు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న బలమైన కోరికతో రగిలిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన మహ్మద్ షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. దీంతో ఉనద్కత్ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. 
 
కాగా, బొటన వేలి గాయం కారణంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఇప్పటికే వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్ అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత్ జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. 
 
కాగా, టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై భారత్ ఇప్పటివరకు ఓటమి ఎరుగదు. కాబట్టి ఈ సిరీస్‌లోన అదే జోరు కొనసాగించాలని భారత్ యోచిస్తుంది. మరోవైపు, బంగ్లాదేశ్ క్రికెటర్ జకీర్ హాసన్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేశారు. భారత జట్టును ఇన్నింగ్స్‌ను శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ ప్రారంభించారు.