ఆదివారం, 10 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (13:49 IST)

కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ : 146 పరుగులకు భారత్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

Rajkot Test
కాన్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక బంగ్లాదేశ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు అలౌట్ అయింది. దీంతో భారత్ ముంగిట 95 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఓవర్ నైట్ స్కోర్ 26/2తో ఐదో రోజు ఆటను కొనసాగించి, 146 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాకు 94 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ ముందు 95 పరుగుల లక్ష్యాన్ని ఉంది.
 
బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ అర్థశతకం (50) చేయగా, మరో సినీయర్ ఆటగాడు ముషిఫికర్ 37 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఇక భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి చొప్పున వికెట్లు తీయగా, ఆకాశ్ దీపక్‌కు ఒక వికెట్ దక్కింది.
 
అంతకుముందు నాలుగో రోజు బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌లో 233 రన్స్‌కు ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగి బంగ్లా బౌలర్లను హడలెత్తించింది. వన్డే తరహా బ్యాటింగ్‌తో వేగంగా స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 285 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు 52 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఐదో రోజైన మంగళవారం మరో 120 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లు పారేసుకుంది. భోజన విరామం తర్వాత ఇండియా 95 రన్స్ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆడనుంది. ఈ రోజుల ఆటలో మరో 62 ఓవర్లు మిగిలి ఉన్నాయి. దీంతో ఇది రోహిత్ సేనకు కష్టసాధ్యమైన టార్గెట్ ఏమీ కాదు. చాలా సులువుగానే గెలిచే అవకాశం ఉంది.