శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (11:41 IST)

చెన్నై రెండో టెస్టుకు అందుబాటులో అక్షర్ పటేల్

ప్రస్తుతం  స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయభేరీ మోగించింది. రెండో టెస్టు కూడా చెన్నైలోనే జరుగనుంది. అయితే, తొలి టెస్టుకు దూరమైన అక్షర్ పటేల్ ఇపుడు అందుబాటులోకి వచ్చినట్టు బీసీసీఐ వెల్లడించింది.
 
ఇదే అంశంపై బీసీసీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి టెస్టుకు ముందు అతడి ఎడమ మోకాలిలో నొప్పి కారణంగా పక్కకు పెట్టారు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న అక్షర్‌.. రెండో టెస్టు తుది జట్టు ఎంపికకు సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
 
ఇక అంతకుముందు షాబాజ్‌ నదీమ్‌, రాహుల్‌ చాహర్‌ను ప్రధాన ఆటగాళ్ల జాబితాకు ఎంపిక చేయగా ఇప్పుడు వారిని మళ్లీ స్టాండ్‌ బై ఆటగాళ్ల జాబితాలోకి చేర్చారు. కాగా, తొలి టెస్టులో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌లో నదీమ్‌ అనూహ్యంగా తుది 11 మందిలో చోటు దక్కించుకున్నాడు. 
 
సహజంగా కుల్‌దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరి క్షణంలో జట్టు యాజమాన్యం నదీమ్‌ను తీసుకుంది. అయితే, వచ్చిన అవకాశాన్ని ఈ యువ క్రికెటర్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో రెండో టెస్టు నుంచి అతడిని తొలగించారని తెలుస్తోంది.
 
భారత జట్టు :
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌పంత్‌(కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్‌బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకుర్‌
 
స్టాండ్‌బై ఆటగాళ్లు: కేఎస్‌ భరత్‌, అభిమణ్యు ఈశ్వరన్‌, షాబాజ్‌ నదీమ్‌, రాహుల్‌ చాహర్‌, ప్రియాంక్‌ పంచల్‌
 
నెట్‌ బౌలర్లు: అంకిత్‌ రాజ్‌పుత్‌, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ వారియర్‌, కృష్ణప్ప గౌతమ్‌, సౌరభ్‌ కుమార్‌