సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2017 (17:13 IST)

కోహ్లీ అరుదైన ఘనత: సచిన్‌కి తర్వాత అత్యధిక శతకాలు సాధించిన విరాట్

భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన 200 వన్డేలో అద్భుత శతకం బాదేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ టెండూల్కర్‌ (49) తర్వాత అత్యధిక శతకాలు బాదేస

భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన 200 వన్డేలో అద్భుత శతకం బాదేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ టెండూల్కర్‌ (49) తర్వాత అత్యధిక శతకాలు బాదేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అతడు తన అత్యుత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.
 
తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ వికెట్లు కోల్పోవడంతో కోహ్లీ-ధోనీల భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ వంద పరుగులు పూర్తి చేశాడు. 108 బంతుల్లో కోహ్లీ 100 పరుగులు కొట్టాడు. దీంతో, వన్డే కెరీర్‌లో కోహ్లీ తన 31వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు 7 ఫోర్లు, 1 సిక్స్‌ను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ధోనీ అవుట్ కావడంతో కోహ్లీకి జతకట్టిన పాండ్యా దూకుడుగా ఆడుతున్నాడు.