సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (22:52 IST)

భారత్- వెస్టిండీస్ తొలి టీ-20: భారత విజయలక్ష్యం 150

India_West Indies
India_West Indies
ధరోబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 జరగనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రోమన్ పావెల్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. 
 
నికోలస్ పూరన్ 41 పరుగులు, బ్రాండన్ కింగ్ 28 పరుగులు చేశారు. దీంతో విండీస్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. 
 
వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ను భారీ స్కోరు చేయనివ్వకుండా కట్టడి చేశారు. భారత జట్టులో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు తీశారు.