శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (14:56 IST)

పృధ్వీషా అదుర్స్.. టీమిండియాకు మరో సచిన్ రెడీనా?

వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న టెస్టులో పృధ్వీషా అదరగొట్టేస్తున్నాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే వంద బంతుల్లోపే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా తాను ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన ఆ

వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న టెస్టులో పృధ్వీషా అదరగొట్టేస్తున్నాడు. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే వంద బంతుల్లోపే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా తాను ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. 
 
ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టును ఆడుతూ, 100 బంతుల్లోపే సెంచరీ సాధించింది ఇంతవరకూ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే. గతంలో వెస్టిండీస్ కు చెందిన డ్వేన్ స్మిత్ తన అరంగేట్రంలో 93 బంతుల్లో సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ తానాడిన మొదటి మ్యాచ్ లో 85 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ప్రస్తుతం వీరిద్దరి సరసన పృధ్వీషా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పృధ్వీషా 99 బంతుల్లో శతక్కొట్టాడు. 
 
ఇదిలా ఉంటే.. పృధ్వీషాను చూస్తే సచినే గుర్తుకు వస్తున్నాడని... క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఎటువైపు షాట్లు కొట్టినా సచిన్ మైదానంలో నిలిచి కొడుతున్నట్టే వుంటి పృధ్వీషా బ్యాటింగ్. పృధ్వీషా అరంగేట్రం చేసిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. 
 
తొలి ఓవర్లోనే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అవుటైనా, ఆ ప్రభావాన్ని తనపై పడ్డట్టు ఏ క్షణమూ కనిపించని పృధ్వీ, టెస్టు మ్యాచ్‌ని వన్డేలా ఆడాడు. కేవలం 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పృధ్వీకి మరో ఎండ్ లో ఉండి సహకారాన్ని అందిస్తున్న ఛటేశ్వర్ పుజారా, ప్రస్తుతం 38 పరుగులు చేశాడు.